Tuesday, 13 December 2016

మోడీ స్టింగ్ ఆపరేషన్ లో దొరికి పోయిన ఇంటి దొంగలు

పెద్ద నోట్ల రద్దు తరవాత కొత్త నోట్లను సామాన్యులకు అందనీకుండా బ్యాంక్ అధికారులు నల్ల బాబులకు అందించేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపద్యంలో చాలా మంది బ్యాంకు అధికారులు అరెస్టు కాగా, మరికోందరిని విధులనుంచి పక్కబెట్టగా , ఇంకొందరిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ‘‘పెద్దనోట్ల రద్దు కారణంగా ఎన్నిరోజులైనా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ 125 కోట్ల ప్రజల కలలు సాకారం కాకుండా… అక్రమాలకు ఒడిగడుతూ ఇబ్బందులకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు’’ అని ప్రధాని ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
శనివారం గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతులతో ప్రధాని మాట్లాడుతూ… ‘‘మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు కాబట్టి… దొడ్డిదారిన ఏదో ఒకటి చేయొచ్చని బ్యాంకు అధికారులు కొందరు భావించారు. అయితే మోదీ వెనక గేట్ల వద్ద కెమేరాలు పెట్టిన సంగతి వారికి తెలియదు. ఒక్కర్నీ వదిలిపెట్టకుండా వారందర్నీ అరెస్టు చేస్తాం’’ అని ప్రధాని ప్రకటించారు. అయితే అక్రమ బ్యాంకర్లను జైలుకు పంపడమే కేంద్ర ప్రభుత్వ తదుపరి వ్యూహమని… ఇందులో భాగంగా ఇప్పటికే 400 సీడీలను ఆర్ధిక శాఖకు పంపినట్టు చెబుతున్నారు.ఈ సీడీల్లో బ్యాంకు అధికారుల సాయంతో కొందరు పోలీసులు, అవినీతి అధికారులు, మరి కొందరు ప్రముఖులు పాత నోట్లను ఎలా మార్చుకున్నదీ స్పష్టంగా రికార్డయినట్టు సమాచారం. స్టింగ్ ఆపరేషన్ తర్వాత పలు ప్రభుత్వ బ్యాంకులతో పాటు మరికొన్ని బ్యాంకులపై కేంద్ర ఆర్థిక శాఖ మరింత నిఘా వేసిందని అంటున్నారు. . ఓ వైపు బ్యాంకుల బయట జనాలు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తుంటే.. మరోవైపు బ్యాంకు అధికారులు కూడబలుక్కుని మరీ నోట్ల కట్టలను తరలించిన వైనంపై మోదీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. పైపెచ్చు సాధారణ ప్రజల నుంచి వచ్చిన గుర్తింపు కార్డుల జిరాక్సులనే మళ్లీ మళ్లీ ఉపయోగించి… నల్లడబ్బు మార్పిడికి వినియోగించుకున్నట్టు కూడా కేంద్రం దృష్టికి వచ్చింది.

No comments:

Post a Comment