Tuesday, 13 December 2016

విడాకులకు మరో టాప్ హీరోయిన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా దక్షినాధిలో ఓ వెలుగు వెలిగిన అందల భామ మీరా జాస్మిన్ వైవాహిక బంధం కూడా తెగిపోవడానికి దగ్గరగా ఉంది. తెలుగులో కంటే తమిళ, మలయాళం సినిమాల్లో ఎక్కువ పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజేష్ అనే మ్యుజీషియన్ తో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో. తర్వాత అనిల్ జాన్ వ్యాపారవేత్తతో అఫైర్ స్టార్ట్ చేసింది. అయితే అప్పటికే అనిల్ కు పెళ్లయింది. మీరా కోసం తన భార్యకు విడాకులిచ్చాడు అనిల్. అటు తర్వాత పెళ్లికి చేసుకుంటున్న సమయంలో మీరాపై అనిల్ భార్య తరపు బంధువులు దాడి చేశారు. అనంతరం పోలీసుల రక్షణలో వీరు పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల వీరి బంధానికి అప్పుడే నూకలు చెల్లిపోనున్నాయి. విడిపోవాలని వీరిరువురు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతేడాది కాలం నుంచే తన భర్తకు దూరంగా మీరా ఉండోందట. విడాకుల కోసం త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment