Tuesday, 6 December 2016

జయ లలిత కోరుకున్న విధంగా.. అంత్యక్రియలు

 తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలిత అంత్యక్రియలు ఆమె కోరుకున్న విధంగా నిర్వహించారు. కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయ లలితకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే తాను చనిపోతే తన భౌతిక కాయాన్ని దహనం చేయవద్దని, ఖననం చేయాలని, అదీ కూడా ఎంజీఆర్ సమాధి పక్కనే జరగాలని ఆమె ఆకాక్షించారు. దీంతో మంగళవారం ఆ మేరకు జయ లలిత పార్థీవ శరీరాన్ని మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కన ఖననం చేశారు. జయ లలిత ప్రియ సఖి శశికళ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.

No comments:

Post a Comment