ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. గత ఐదు రోజుల్లో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. దీనిపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి డిజిటల్ లావాదేవీలు నడుస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధిస్తుందన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ చెల్లింపులు ఆన్ లైన్ లో జరిపేందుకు తయారుచేసిన టీఎస్ వాలెట్ అప్లికేషన్ ను 14న జరిగే కలెక్టర్ల సమావేశంలో లాంఛ్ చేయనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో నగదురహిత లావాదేవీల సంఖ్యను పెంచడంలో భాగంగా.. ICICI బ్యాంకు ఉన్నతాధికారులు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. డిజిటల్ లావాదేవీల వలన కలిగే లాభాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని బ్యాంకు అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ విధానాన్ని అలవాటు చేసుకోవడం తప్పనిసరి అయ్యిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది డెబిట్ కార్డులు, వాడుతున్నారు? ఎన్ని బ్యాంకులు కార్డులు జారీ చేశాయి.? రాష్ట్రంలో జారీ అయిన మొత్తం కార్డులు, వాడకంలో ఉన్న కార్డుల సంఖ్య వివరాలు బ్యాంకుల నుంచి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్డుల సంఖ్యను లెక్కించాలన్నారు.
బ్యాంకుల ద్వారా ఆర్దిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు మొబైల్ అప్లికేషన్లు, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి అంశాలపై గ్రామీణ యువతకు శిక్షణఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణప్రాంతాల్లోని రైతులు, కూలీల, కులవృత్తుల వారికి వీటిపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై ICICI బ్యాంకు అధికారులు సీఎంకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. మొదటి దశలో ప్రభుత్వ ఆర్థికలావాదేవీలను డిజిటల్ విధానంలోకి మార్చాలన్నారు.
No comments:
Post a Comment