పొయెస్ గార్డెన్! ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది చెన్నైలోని జయలలిత నివాసం! చెన్నై నడిమధ్యలో ఉండే అత్యంత విలాసవంతమైన ప్రాంతమిది! జయలలిత ఇంటి పక్కనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉంటారు. చెన్నైలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, న్యాయవాదుల ఇళ్లన్నీ ఇక్కడే ఉంటాయి. వాటన్నిటిలోనూ నిత్యం కళకళలాడేది ‘వేద నిలయం’! అదే జయలలిత నివాసం. తన తల్లి అసలు పేరు వేదవల్లి పేరిట ఆమె దానికి ఆ పేరు పెట్టారు. ఈ ఇంటిని 1967లోనే ఆమె రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం 24 వేల చదరపు అడుగుల్లో విస్తరించింది. ఇందులో బిల్టప్ ఏరియానే 21,662 చదరపు అడుగులు. ప్రస్తుతం దాని విలువ రూ.45 కోట్లకుపైనే. అయితే, ఈ ప్రాంతమే కాదు.. జయలలిత నివాసం కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్యనే ఉంటుంది. ‘వేద నిలయం’లోకి మహామహులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఏదేని ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పితే, మం త్రులకూ ఈ భవనంలోకి ప్రవేశం లభించదు. ముఖ్య నేతలు, విశ్వాసపాత్రులైన ఐఏఎ్‌సలు సైతం ఈ ఇంటి లోపల ఎలా ఉంటుందో తెలియదని చెబుతుంటారు. వేద నిలయంలో 20 మందికి పైగా పనివాళ్లు ఉంటారని సమాచారం. జయ వెంట మాత్రం శశికళ, ఆమె మరదలు ఇళవరసి, ఇరవయ్యేళ్ల వయసుండే ఇద్దరు యువతులు మాత్రమే ఉంటారు. ఈ యువతుల్ని శశికళ వేరే ప్రాంతాల నుంచి తెప్పించారని కొందరు, నరేంద్ర మోదీయే పంపించారని మరి కొందరు చెబుతుంటారు. జయకు అవసరమైన మాత్రల నుంచి మేకప్ టచప్ ఇచ్చే వరకూ వీరిద్దరే చూసుకుంటుంటారు. వేద నిలయం సమీపంలోనే వినాయకుడి చిన్న గుడి వంటిది ఉంటుంది. జయ ఇంటి బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్లేటప్పుడు ఇక్కడి విఘ్నేశ్వరునికి మొక్కి వెళ్తారు
No comments:
Post a Comment