Tuesday, 6 December 2016

శోభ‌న్‌బాబుకు – జ‌య ఎందుకు దూర‌మైంది..?

త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు, ఆంధ్రుల అందాల హీరో శోభ‌న్‌బాబుకు మ‌ధ్య ఉన్న ప్ర‌త్యేక‌మైన రిలేష‌న్ షిఫ్ గురించి చాలా క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. జ‌య‌తో క‌లిసి న‌టించేందుకు శోభ‌న్‌బాబు ఎంతో ప‌రిత‌పించేవార‌ట‌. ఓసారి జ‌య ప‌క్క‌న న‌టించే ఛాన్స్ శోభ‌న్‌బాబుకు వ‌చ్చినా అప్పుడు శోభ‌న్‌బాబు అంత స్టార్ హీరో కాక‌పోవ‌డంతో జ‌య త‌ల్లి వేద‌ శోభ‌న్‌బాబు ప‌క్క‌న వ‌ద్ద‌ని చెప్పింద‌ట‌.
1973లో డాక్ట‌ర్ బాబు సినిమా షూటింగ్ లో ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ త‌ర్వాత జ‌య త‌ల్లి వేద చ‌నిపోవ‌డంతో జ‌య‌ను అయిన‌వాళ్లే మోసం చేయ‌డంతో ఆ టైంలో ఆమె శోభ‌న్‌బాబుకు బాగా ద‌గ్గ‌రైంది. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నానని.. మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోందని జయలలిత తనతో స్వయంగా చెప్పినట్లు ఓ సందర్భంలో శోభన్ బాబు చెప్పడం విశేషం.

 ఒకానొక ద‌శ‌లో ఆమె శోభ‌న్‌బాబును పెళ్లి చేసుకోవాల‌ని కూడా అనుకున్నారు. వీరిద్ద‌రికి ఉన్న వివాహేతర సంబంధం వ‌ల్ల వారికి పుట్టిన పాప‌కు శోభ‌న అనే పేరు కూడా పెట్టార‌ని కూడా రూమ‌ర్లు ఉన్నాయి. అప్ప‌టికే శోభ‌న్‌బాబుకు పెళ్ల‌యిపోవ‌డంతో పాటు… తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ.. ఎంజీఆర్ కు దగ్గరై శోభన్ బాబుకు పూర్తిగా దూరమైందని అంటారు.

No comments:

Post a Comment