తమిళనాడు సీఎం జయలలిత అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలుకా మేలుకోటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. ఇది ప్రస్తుతం కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. జయలలిత తల్లి పేరు వేదవల్లి (సంధ్య). జయలలితకు ఆమె తల్లిదండ్రులు కోమలవల్లిగా నామకరణం చేశారు. ఆమె అసలు పేరు కోమలవల్లి.
జయ 1981లో జయ రాజకీయాల్లోకి వచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ పనిచేశారు. జయ 15వ ఏట సినీ పరిశ్రమలోకి జయ అడుగుపెట్టారు. హీరోయిన్‌గా ఆమె తొలిచిత్రం ‘చిన్నడగొంబె’ (కన్నడ), మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారాన్ని ఇచ్చి జయలలితను గౌరవించింది.
ఇక జయకు అసలు పేరు కోమలవల్లి అయినా ఆమెకు ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. తమిళ జనాలు ఆమెను అమ్మ అని ఎంతో అప్యాయంగా, ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే ఆమెను పురుచ్చితలైవి (విప్లవ నాయకురాలు), ఇక జయలలిత అని కూడా పిలుచుకుంటారు.
No comments:
Post a Comment