తమిళనాటు అమ్మ జయలలిత తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్నది ఎవరంటే తలైవా రజనీకాంతే. ఈ జాబితాలో మూడో ప్లేస్‌లో తల అజిత్ ఉంటాడు. ఇదిలా ఉంటే సూపర్‌స్టార్‌కు అమ్మకు కొన్ని సందర్భాల్లో పూడ్చలేని గ్యాప్ వచ్చింది. వీరిద్దరి వార్ వెనక ఉన్న కారణాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు మనకు కనిపిస్తాయి. 1996లో రజనీ జయ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని చెప్పారు.
ఈ ఒక్క నినాదమే నాడు జయ ప్రత్యర్థులకు సోలో నినాదంలో మారిపోయింది. అదే రజనీకాంత్ 2011లో ‘‘జయలలిత విజయం తమిళనాడును కాపాడింది’’ అని ప్రకటించడం గమనార్హం. వీరిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. చెన్నైకు చెందిన గాయత్రీ శ్రీకాంత అనే నేత్రవైద్య నిపుణురాలు ‘ద నేమ్ ఈజ్ రజనీకాంత్’ అనే పుస్తకంలో దాని గురించి వివరించారు. ఆమె రాసిన కథనం ప్రకారం…..
ఓ సారి రజనీ తన కారులో వెళుతుండగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకు ట్రాఫిక్ ఆగిందని రజనీకాంత్ ప్రశ్నించగా.. సీఎం జయలలిత ఆ దారిలో వస్తున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ఆపేశారని అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ చెప్పాడు. ఆమె ఎంతసేపట్లో వస్తారని రజనీ ప్రశ్నించగా.. తెలియదని, బహుశా అరగంటలో రావచ్చని అతడు సమాధానమిచ్చాడు.
అప్పటి వరకు ట్రాఫిక్ పంపాలని రజనీ చెప్పారు. తమకు ట్రాఫిక్ ఆపేయాలని ఆదేశాలున్నట్టు పోలీసులు చెప్పారు. దీంతో రజనీ కారులోనుంచి బయటకు దిగి సమీపంలో ఉన్న బడ్డీకొట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్ కొని వెలిగించి.. పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని తాపీగా తాగడం మొదలుపెట్టారు! సాక్షాత్తూ రజనీకాంత్ రోడ్డు మీద కనపడితే అభిమానులు ఊరుకుంటారా..! క్షణాల్లో అక్కడ వేలాది మంది గుమిగూడారు. ఫలితం.. ఆ దారిలో వస్తున్న జయలలిత ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు!!
No comments:
Post a Comment