Tuesday, 13 December 2016

వారం మొత్తానికి ప్రణాళిక ఇలా

వ్యాయామం అనగానే ఏదో ఒక తరహానే అనుకుంటాం. కానీ దానివల్ల అన్నిసార్లూ పెద్దగా ప్రయోజనం లేదు. అందుకే వారంలో వివిధ తరహా వ్యాయామాలు చేయడం వల్ల శరీరం మొత్తం చురుగ్గా ఉంటుంది.
* రోజులు తరబడి కేవలం నడవడం వల్ల, లేదా పరుగు మాత్రమే పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. వారంలో తొలి ఐదురోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ కార్డియో తరహా వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అది కూడా తప్పనిసరిగా 30 నిమిషాలకు తగ్గకుండా చేయాలి. అంటే పరుగు పెట్టడం, సైకిలు తొక్కడం, హిట్‌(హైఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌)వంటివన్నీ ఇందులోకి వస్తాయి. వీటిని చేయడం వల్ల కాళ్లూ, చేతుల్లో ఉండే కొవ్వు క్రమంగా తగ్గుతుంది. పైవి చేసిన తర్వాత కూడా చేతులకి సంబంధించి వ్యాయామాలని ఒక్కోటి ఇరవై సార్లు చేయాలి. చేతులని పైకి ఎత్తి కిందకు దించడం ఇరవైసార్లు చేయాలి. అలాగే చేతుల్లో తేలికపాటి బరువులని ఉంచుకుని వాటిని కూడా ఇరవైసార్లు పైకి ఎత్తి దించాలి.
* శనివారం మాత్రం పూర్తిగా కాళ్లకు సంబంధించిన వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ఓ ఇరవై సెకన్లపాటూ గోడకు ఆనుకుని కూర్చోవాలి. అరనిమిషం పాటూ నేలమీద పడుకుని కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి పెట్టాలి. 100 సార్లు లెక్కపెట్టుకుని తాడాట ఆడొచ్చు. కాస్త విరామం తీసుకుని నలభైసార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని వదులుతూ ఉండాలి.
* ఆదివారం మాత్రం అన్నిరకాల వ్యాయామాలని ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా శరీరం మొత్తానికి పనిచెప్పే స్ట్రెచెస్‌, క్రంచెస్‌తో పాటూ... చతురంగ దండాసనం (ప్లాంక్‌) వ్యాయామాలు చేయాలి. బోర్లాపడుకుని కాలి వేళ్లూ, మోచేతులపై బరువు ఉంచి అరనిమిషం పాటూ ఉండాలి. దీనివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది.

No comments:

Post a Comment