Tuesday, 13 December 2016

చుండ్రుకు మెంతుల పరిష్కారం

చలికాలంలో ప్రధానంగా వేధించే సమస్య చుండ్రు, దురద. అది భుజాలు, ముఖం మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీంతో మొటిమలూ వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలున్నాయి.


గోరువెచ్చని కొబ్బరినూనె తరచూ మాడుకు రాస్తూ ఉండాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు అదుపులో ఉంటుంది. మెంతుల్లో అమినో ఆమ్లాలు, ప్రొటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చుండ్రు రాకుండా అడ్డుకుంటాయి. రెండు చెంచాల మెంతుల్ని కప్పు నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని మెత్తగా చేసి మాడుకి పట్టించి అరగంట తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో కడిగేయాలి. దీన్నివల్ల జుట్టూ మెరుస్తుంది.
* వేపాకులో ఫంగస్‌ను పారదోలే గుణాలున్నాయి. దీంతో చుండ్రు, దాని తాలుకు దురద మాయమవుతుంది. తగినన్ని వేపాకులను నాలుగైదు కప్పుల వేడినీళ్లలో వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీళ్లతో జుట్టును కడిగేయాలి. వేపాకుల ముద్దని మాడుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేసినా ఫలితం కనిపిస్తుంది.
* నిమ్మరసంలో ఉండే ఆమ్లాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. ఒక నిమ్మకాయ రసాన్ని కప్పు నీళ్లలో వేసి ఆ మిశ్రమంతో జుట్టు కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు అదుపులో ఉంటుంది.
* చెంచా టీ ట్రీ నూనెని కప్పు వేడినీళ్లలో కలపాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీళ్లను తల మీద ధారలా పోసి మర్దనా చేసి రెండు నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. కలబంద గుజ్జును మాడు, జుట్టుకి పట్టించి పావుగంట తర్వాత షాంపూతో కడిగేసినా ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment