భారతదేశం రోజురోజుకు తన అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటూ పోతోందని, అణుజలాంతర్గాముల నిర్మాణంలో ఆదేశం బిజీగా ఉందని పాకిస్థాన్ అత్యున్నత అధికారి ఒకరు ఈరోజు పేర్కొన్నారు. పాక్ తనను తాను రక్షించుకునేందుకు చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శి(యూఎన్ అండ్ ఎకనమిక్ కార్పొరేషన్) తస్నిమ్ అస్లామ్ అన్నారు.
‘‘భారత్ అణు జలాంతర్గాములను అభివృద్ధి చేస్తోంది. నియంత్రణ రేఖ వద్ద కాల్పులతో రెచ్చగొడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ తనను తాను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండడం తప్ప మరో దారి లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు భారత్ రోజురోజుకు తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు. పాక్ తనను తాను నియంత్రించుకుంటూ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలను చర్చించుకునేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. భారత నాయకులు చేస్తున్న అర్థరహిత ఆరోపణలు ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని తస్నిమ్ ఆరోపించారు.
No comments:
Post a Comment