Tuesday, 6 December 2016

జ‌య ఆస్తులు ఎన్ని…? ఎవ‌రికి …?

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ఆక‌స్మిక మ‌ర‌ణం అనేక ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ లేకుండా చేసేసింది. జ‌య ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆమె వార‌సురాలు ఎవ‌రు ? అన్న సందేహాలు ఒక‌వైపు త‌లెత్తుతుంటే…కోట్ల‌లో ఉన్న ఆమె ఆస్తుల‌కు వార‌సులు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు కూడా ఇప్పుడు స‌రైన స‌మాధానం లేదు. జ‌య సీఎంగా ఉన్న‌ప్పుడు ఆమె కోట్ల‌లోనే ఆస్తులు కూడ‌బెట్టార‌న్న టాక్ ఉంది.
జ‌య‌కు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల‌తో పాటు ముఖ్య ప‌ట్ట‌ణాల్లోను లెక్క‌కు మిక్కిలిగా ఆస్తులు ఉన్నాయి. ఇళ్లు, స్థ‌లాలు, ఫాంహౌస్‌లు, తోట‌లు, పొలాల‌కు కూడా లెక్క‌లేద‌నే స‌మాచారం. ఉంది. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, తిరువ‌నంత‌పురం, పుదుచ్చేరి, ఢిల్లీ ప్రాంతాల్లో వంద‌ల ఎక‌రాల్లో స్థ‌లాలు, బంగ‌ళాలు ఉన్నాయి.
హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల‌లో ఆమెకు 30 ఎక‌రాల ఫామ్ హౌస్ ఉంది. అక్క‌డ అంద‌రూ త‌మిళ‌నాడుకు చెందిన వారే ఉంటారు. ఇక ఇప్పుడు జ‌య ఆక‌స్మిక మృతితో వీటిని ఎవ‌రు పంచుకుంటారు ? అన్న ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం లేదు. ఆమె అవివాహితురాలు, ఆమె సోద‌రుడి పిల్ల‌ల‌ను ఆమె ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. త‌ర్వాత పెంపుడు కొడుక‌ను దూరం పెట్టారు. త‌న ఆస్తుల‌ను త‌న త‌ర్వాత ఎవ‌రికి చెందాలో ఆమె వీలునామా రాయ‌లేదు.

 వాటి విలువ ఇప్పుడు కోట్ల‌లో ఉంటుంద‌ట‌. వాటిని పెంపుడు కొడుకుకి ఇస్తారా ..? అలా కానిప‌క్షంలో అన్నాడీఎంకే పార్టీకి వాటిని అంకితం చేయాలి. అలా వీలుప‌డ‌క‌పోతే.. ప్ర‌భుత్వ‌మే ఆ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుని నిర్వ‌హించాల్సి ఉంటుంది. మ‌రి అమ్మ ఆస్తులు అంతిమంగా ఎవ‌రికి చెందుతాయో చూడాలి.

No comments:

Post a Comment