Tuesday, 6 December 2016

శ‌శిక‌ళ సీఎం కాకుండా చ‌క్రం తిప్పింది ఎవ‌రు..!

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత గ‌త అర్ధ‌రాత్రి ఆక‌స్మికంగా మృతి చెందారు. ఆమె త‌ర్వాత ఆమె నెచ్చెలి అయిన శ‌శిక‌ళ సీఎం ఎందుకు అవ్వ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు విన‌వ‌స్తున్నాయి. గ‌తంలో త‌మిళ‌నాడులో అన్నా దురై, ఎంజీఆర్‌లు చనిపోయినప్పుడు తొందరపడి సీఎంను ఎంపిక చేసుకోలేదు. మరి నిన్న రాత్రికి రాత్రి పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఆగమేఘాల మీద ఎందుకు జరిగిపోయింది ? ప‌న్నీర్ సెల్వం వెంట‌నే సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం వెన‌క ఢిల్లీలోని బీజేపీ ప్ర‌భుత్వం డైరెక్ష‌న్‌లో కేంద్ర మంత్రి వెంక‌య్య ఆధ్వ‌ర్యంలోనే ఈ తంతు అంతా జ‌రిగిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.
కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట బీజేపీ తలదూర్చి ఎదుగుతోంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తలదూర్చేందుకు అవకాశం కోసం కాచుకుకూర్చోందని, ఆ అవకాశం ఎవ్వ‌రికి ఇవ్వరాదనే ఉద్దేశంతోనే బీజేపీ ప‌న్నీర్‌సెల్వంను వెంట‌నే త‌మిళ‌నాడు సీఎం పీఠంపై కూర్చోపెట్టేలా తెర వెనక మోడీ మంత్రాంగం – వెంక‌య్య డైరెక్ష‌న్ ఉన్నాయ‌న్న టాక్ వ‌స్తోంది

No comments:

Post a Comment