నోట్లరద్దు
నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కేంద్రం చర్యలు
తీసుకుంటుందా? రానున్న బడ్జెట్‌లో ప్రజోపయోగ తాయిలాలు ప్రకటించనుందా?...
అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఒక్క దెబ్బకు రెండుపిట్టలు అన్నచందంగా
ఇటు ప్రజలను శాంతింపజేయడంతోపాటు, నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం
మరిన్ని చర్యలు తీసుకోనుందని సమాచారం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో భారీగా
పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమాచారం
ప్రకారం... వచ్చే బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలకు అవకాశముందంటున్నారు.
- వార్షిక ఆదాయం రూ. 4 లక్షల వరకు పన్ను ఉండకపోవచ్చు...
- రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం ట్యాక్స్...
- రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్...
- రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్...
- వార్షిక ఆదాయం రూ. 20 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్...
ప్రస్తుతం పరిస్థితి...
- రూ. 2.5 లక్షల వరకే పన్ను మినహాయింపు...
- రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 10శాతం ట్యాక్స్...
- రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్...
- వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్...
No comments:
Post a Comment