పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ. డిసెంబర్ 10వ తేదీ వరకు పాత 500, వెయ్యి రూపాయల నోట్లు.. రూ.12లక్షల 44 వేల కోట్లు బ్యాంకులకు వచ్చాయని ప్రకటించారు. ఈ నోట్లన్నీ అకౌంట్లలో డిపాజిట్ అయ్యాయన్నారు. కొత్త నోట్లను 4 లక్షల 61వేల కోట్ల విలువైన నోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో లక్షా 70వేల కోట్ల రూపాయల విలువ చేసే రూ.2వేల నోట్లు, కొత్త రూ.500 నోట్లు ఉన్నాయన్నారు. మిగతా మొత్తాన్ని 10, 20, 50, 100 నోట్లు ఉన్నాయన్నారు.
No comments:
Post a Comment