తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి వారం రోజులు దాటినా ఇంకా ఆమె మరణంపైనా, ఆమె ఆస్తులపైనా ఎడతెగలేని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు అమ్మ ఎలా చనిపోయిందన్న చర్చలకు తమిళ జనాల్లోను, తమిళ మీడియాలోను బ్రేకుల్లేని చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇలా ఉండగానే ఆమె ఆస్తులు ఎవరికి చెందాలన్న చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది.
జయ మేనకోడలు దీప జయ మరణం తరవాత ఆమె మరణానికి కారణం శశికలే అనీ, ఆమెను ఆస్థి కోసమే చంపారని, తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీప మృతి సంగతి అలా ఉంటే జయకు హైదరాబాద్ సమీపంలో ఉన్న ఆస్తులు ఎవరికి చెందుతాయన్న ప్రశ్నలు ఇక్కడ కూడా వ్యక్తమవుతున్నాయి.
తాజాగా తమిళనాట అమ్మ ఆస్తులపై వివాదం కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో జయలలిత ఆస్తులకు సంబంధించి ఒక ప్రజాహిత వ్యాజ్యం నమోదైంది. గరీబ్ గైడ్ అనే ఓ ఎన్ జి ఓ సంస్థ ఈ వ్యాజ్యాన్ని వేసింది. ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకుని, ప్రజల ఆస్తిగా ప్రకటించాలని ఈ వ్యాజ్యంలో జి. భారవి కోరారు.
జయలలిత 2016 ఎన్నికలకు ముందు మే లో ప్రకటించిన అఫిడవిట్ లో తనకు 113.73 కోట్ల ఆస్థి ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఆస్తిలో మేడ్చల్ లో 14 ఎకరాలు, శ్రీనగర్ కాలనీలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారవి జయకు పెళ్లి కాలేదని చెప్పారు. ఆమెకు తల్లిదండ్రులు కూడా లేరని, ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని పేర్కొనడంతో పాటు శశికళ నటరాజన్ కు ఆమె ఆస్తిపై ఎలాంటి హక్కులేదని ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment