సూపర్‌స్టార్ రజనీకాంత్ బర్త్‌డే అంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోమవారం రజనీ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో రజనీ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల మంది రజనీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలోనే రజనీ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని సీక్రెట్స్ కూడా షేర్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే రజనీకి హీరోయిన్లతో అలాంటి ఇలాంటి లింకులు ఉన్నట్టు ఎప్పుడూ ఎలాంటి వార్తలు వినపడలేదు. రజనీ అలాంటి వాటికి ఆమడ దూరంలో ఉంటారు కూడా. అయితే రజనీ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు 1980వ దశకంలో ఆయన మీద ఉన్న ఓ రూమర్ పెద్దగా బయటకు చర్చకు రాకుండా అలాగే ఉండిపోయిందన్న టాక్ ఉంది.
1980వ దశకంలో ఓ హీరోయిన్‌ని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని భావించాడట. ఆ హీరోయిన్‌తో రజనీ రిలేషన్ అక్కడిదాకా వెళ్లిందనే ప్రచారం జరిగిందని చెబుతుంటారు. ఆమె ఓ అందాల రాశి అట. నటనలో కూడా ఆమె ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది.
రజనీతో వ్యవహారం తర్వాత ఆ హీరోయిన్ చిత్ర పరిశ్రమలోని ఓ బడా వ్యక్తితో ప్రేమలో పడి.. ఆ తర్వాత ఆయననే పెళ్లి చేసుకుంది. ఆ హీరోయిన్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలువురు స్టార్ హీరోలతో నటించింది. ఆ హీరోయిన్ భర్త ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద స్టార్. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ఈ పాటికే మీకు అర్థమైఉంటుంది.
No comments:
Post a Comment