Tuesday, 13 December 2016

రేవంత్ రెడ్డి టిడిపి కి రాజీనామా!కొత్త పార్టీ పేరు ఇదే…

తెలుగు జరిగే జంపింగ్ రాజకీయాలు గురించి అందరికి తెలిసినదే. ఏపీలో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి, వైకాపా నుంచి టీడీపీలోకి, బీజేపీ నుంచి వైకాపాలోకి జంపింగ్ లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో మాత్రం కొత్త పార్టీ జేఏసీ క‌న్వీన‌ర్ కోదండ‌రాం ఆధ్వ‌ర్యంలో వస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా రేవంత్ రెడ్డి పై ఒక కొత్త వార్త తెగ హల్చల్ అవుతుంది. తెలంగాణలో టీడీపీకి రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. రేవంత్ కాకుండా ఉన్న ఒకరిద్దరు కూడా జంప్ అయ్యే సూచనలో ఉన్నట్టు కనిపిస్తింది. తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ‌లో పార్టీల‌కు అతీతంగా కేసీఆర్‌కు ధీటైన ప్ర‌త్య‌ర్థిగా ఉన్నాడు.

 కేసీఆర్‌ను రేవంత్ ఎదుర్కొన్న‌ట్టుగా ఏ పార్టీ నేత కూడా ఎదుర్కొనే సాహ‌సం చేయ‌డం లేదు. అందుకే రేవంత్ ఆంధ్రాకు చెందిన టీడీపీలో ఉండ‌డం కంటే తెలంగాణ‌లో త‌న సామాజిక‌వ‌ర్గంతో పాటు త‌న‌తో క‌లిసి వ‌చ్చే ఇత‌ర పార్టీల రాజ‌కీయ నాయ‌కుల‌తో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ప్రారంభించాల‌నే యోచ‌న‌లో రేవంత్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయన స్థాపించే కొత్తపార్టీ పేరు “ వీర తెలంగాణా” పరిశీలనలో ఉన్నదంట… ఈపేరే ఏంచుకోవడానికి కారణం… తెలంగాణా ఏర్పాటు కావడానికి ఎంతో మంది అమరవీరుల త్యాగాలే తప్ప కెసిఆర్, కెసిఆర్ కుట్టుంభం కాదని ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్లడమే అంట.

No comments:

Post a Comment