Tuesday, 6 December 2016

నాడు జయలలిత ఇంట్లో దొరికినవి ఇవే... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గతం లో ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారని అవి అక్రమ ఆస్తులు అనే ఆరోపణలపై కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  సుబ్రహ్మణ్య స్వామి  ఫిర్యాదు తీసుకొని  జయను విచారించిన పోలీసులు, 1996 జనవరిలో జయలలితతో పాటు  ఆమె స్నేహితురాలు శశికళ, దత్త పుత్రుడు సుధాకరన్, కొంతమంది బంధువులను నిందితులుగా చేసి , ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆపై జయలలితను అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ తరువాత పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో దొరికిన వస్తువులకు అందరు ఆశ్చర్యపడ్డారు.
1991లో కేవలం రెండు కోట్ల రూపాయల ఆస్తులను ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో చూపిన జయలలిత ఆ తరువాత తన ఇంట్లో చేసిన ఈ సోదాలలో 28 కిలోల బంగారం, 880 కిలోల వెండి, 10,500 పట్టు  చీరలు , 750 జతల చెప్పు లు , 91 చేతి గడియారాలు,  స్థిర, చరాస్తులకు సంబంధించిన 306 దస్తా వేజులు లభించాయి.  ఇంత భారీగా ఆస్తులను కూడబెట్టిన విధానం చూసి న్యాయమూర్తులే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లోనే జయ ఆస్తుల విలువ 66 కోట్ల 65 లక్షల రూపాయలని అంచనా వేశారు.

No comments:

Post a Comment