Tuesday, 6 December 2016

తమిళనాడు ముఖ్యమంత్రి గా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం

జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం ఎన్నిక అయ్యారు. జయలలిత గుండెపోటుతో కన్ను మూయడంతో శాసనసభా పక్ష నేతగా పన్నీర్ సెల్వంను ఏఐఏడీఎంకే అధికారికంగా ప్రకటించింది. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి గా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత సోమవారం రాత్రి 11 : 30 నిముషాలకు చనిపోగా.. అర్దరాత్రి 12 : 15 నిముషాలకు ప్రకటన విడుదల చేశారు. అనంతరం 1 : 30 పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పుడు ఆయనే ఈ బాధ్యతలను నిర్వహించారు. జయలలితకు అత్యంత విధేయుడిగా పన్నీరు సెల్వంకు పేరుంది. పార్టీ క్లిష్టసమయాల్లో కూడా జయలలిత కూడా పన్నీరు సెల్వంని ఎంపిక చేశారు. గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పుడు ఆయనే ఈ బాధ్యతలను నిర్వహించారు. 2001లో 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్లడంతో ముఖ్యమంత్రి పదవిని మరోసారి చేపట్టారు. కాగా జయలలిత మృతితో తమిళ నాడులో ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అమ్మ మృతితో తమిళ నాడు ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

No comments:

Post a Comment