Tuesday, 6 December 2016

జయలలిత చుట్టూ కూర్చొని గోళ్లతో గిచ్చడం, కాళ్లను తొక్కడం, చర్మంపై గుచ్చడం చేసారా?

రాజకీయాల్లో ఒక మహిళా నేతగా ఎదగాలంటే ఎన్నో ఆటు పోటీలు భరించాలి. అలానే జయలలిత నాయకురాలిగా ఎదుగుతున్న రోజుల్లో ప్రత్యర్థుల నుండి, సొంత పార్టీ నేతల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఇందులో భాగంగా ఘోర పరాభవాలు చవిచూసింది జయలలిత. అసెంబ్లీలో ఆమెపై చేయి చేసుకునేందుకు డీఎంకే ఎమ్మెల్యే ప్రయత్నం చేసి.. జుట్టు పట్టుకుని ఈడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా జయలలిత రాజకీయ గురువు ఎంజీఆర్ చనిపోయిన రోజు జరిగిన ఓ దుర్ఘటన ఆమెను ఎంతగానో ఆవేదనకు గురిచేసింది. ఎంజీఆర్ చనిపోయిన రోజు జయ పార్థివ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌ లోనే ఉంచారు.
ఆ సమయంలో తనకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి, గురువు చనిపోవడంతో జయలలిత కన్నీరు మున్నీరు  అయ్యారు. ఎంజీఆర్ అంత్యక్రియలకు తరలించే క్రమంలో ఓ వాహనంలో కి ఎక్కేందుకు జయలలిత ప్రయత్నిస్తుండగా.. ఓ ఎమ్మెల్యే కేకలేస్తూ వచ్చి అడ్డుకోగా.. ఎంజీఆర్ భార్య తమ్ముడి కొడుకు, నటుడు దీపన్ జయను సమీపించి ఆమెను కొట్టి.. జుట్టు పట్టుకొని ఈడ్చినంత పనిచేయడంతో ఆమెకి గాయాలు అయ్యాయి. ఇంతటి అవమానాన్ని చవిచూసిన జయ ఎంజీఆర్ అంత్యక్రియలకు వెళ్ళలేదు. ఆ ఘటనపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఆమెను ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆమె చెప్పిన విషయాలు అందరికి షాక్ కి గురి చేశాయి.
"ఎంజీఆర్ చనిపోయారన్న విషయం తెలిసి వెంటనే తొట్టంలోని ఆయన ఇంటికి వెళ్లినా.. నన్ను రానివ్వలేదు. ఆ తరువాత ఎంజీఆర్ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్‌ కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. నా కారు డ్రైవర్‌ తో ఆ అంబులెన్స్‌ను ఫాలో అవ్వమని చెప్పి.. అక్కడ దాదాపు 13 గంటల పాటు నా అభిమాన నేత పార్థివ దేహం దగ్గర కూర్చున్నాను. పార్థివ దేహాన్ని ఉంచిన మరుసటి రోజు కొంతమంది మహిళలు నా చుట్టూ కూర్చుని గోళ్లతో గిచ్చడం, కాళ్లను తొక్కడం, చర్మంపై గుచ్చడం చేసి హింసించారు. అయినా నేను అక్కడే కూర్చున్నా. కొద్దిసేపటికి ఆయన పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న సమయంలో నేనూ వాహనంలోకి ఎక్కడానికి ప్రయత్నించాను.
వెంటనే అక్కడే ఉన్న ఎమ్మెల్యే రామలింగం కేకలు వేస్తూ నా వైపు వచ్చాడు. ఇంతలోపే ఎంజీఆర్ భార్య జానకి తమ్ముడి కొడుకు, నటుడు దీపన్ నా వద్దకి వచ్చి ముఖంపై దాడి చేసి.. జుట్టు పట్టుకుని ఈడ్చివేసి.. వాహనంలో నుంచి కిందికి నెట్టేశాడు. దీనితో నాకు గాయాలు అయ్యాయి. ఇంకా ఆపకుండా.. అసభ్య పదజాలంతో దూషించారు. అనుకోని నేను అంత్యక్రియలకు వెళ్లదల్చుకోలేదు" అని చెప్పారు. పార్టీ లో జయలలిత ఎదుగుతుందనే.. తట్టుకోలేక  ఎంజీఆర్ కుటుంబం ఈ విధంగా చేసినట్లు తెలుస్తుంది.

No comments:

Post a Comment