Tuesday, 13 December 2016

అక్కడ కూడా నోట్ల రద్దు

భారత్ లోనే కాదు విదేశాల్లోనూ నోట్ల రద్దు ప్రకటనలు వెలువడుతున్నాయి. అక్కడి ప్రజలకు ఇక్కడిలాగే నోట్ల కష్టాలు తప్పడం లేదు. వెనిజులాలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో. 100 బొలివర్ నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన వెనిజులా .. నోట్లను మార్చు కోవడానికి 72 గంటల పాటు సమయాన్ని కూడా ఇచ్చింది. స్మగ్లింగ్, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు మదురో. దీనిలో భాగంగా బోర్డర్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 72 గంటల పాటు బార్డర్ మూసివేయాలని తెలిపారు. కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా కరెన్సీ స్మగ్లింగ్ కొన్నేళ్లుగా సాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతాలతో పాటు దేశంలో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. అంతేకాక ప్రజల జీవనంపై నకిలీ కరెన్సీ, స్మగ్లింగ్ తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డర్ మూసివేత ఇదే మొదటిసారి కాదు. ఆగస్టు 2015 లోనూ కొలంబియా బోర్డర్ ను మూసివేసిన వెనిజులా, సుమారు ఏడాది తర్వాత బార్డర్ రీఓపెన్ చేశారు. క్రైమ్, స్మగ్లింగ్ పై పరస్పర సహకారంతో పోరాడాలన్న ఒప్పందంతో బార్డర్ ఓపెన్ చేసింది వెనిజులా.
నోట్ల రద్దుతో భారత్ లో ఉన్న పరిస్థితులే అక్కడ కనపడుతున్నాయి. షాపుల్లో, షాపింక్ కాంప్లెక్స్ లలో పెద్ద నోట్లు చెల్లవు అన్న బోర్డులు కనపడుతున్నాయి.

No comments:

Post a Comment