Tuesday, 13 December 2016

డబ్బును దాచుకోవద్దు : ఆర్బీఐ

ప్రజలు తమ దగ్గరున్న డబ్బును  దాచుకోవద్దని ఆర్బీఐ కోరింది. కరెన్సీని దాచుకోకుండా దానిని వినియోగంలోనికి తీసుకురావాలని విజ్ణప్తి చేసింది. పెద్ద నోట్ల  రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన అన్ని రకాల లావాదేవీలపైనా నిఘా పెట్టినట్లు తెలిపింది.
నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 10 వరకు నెల రోజుల టైంలో 4 లక్షల 61 వేల కోట్ల విలువ చేసే నోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా పంపిణీ చేశామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ తెలిపారు. ఇందులో 1.70 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రూ. 2 వేల నోట్లు, కొత్త రూ. 500 నోట్లు ఉన్నాయని చెప్పారు. మిగతా మొత్తానికి చిన్న నోట్లు పంపించామన్నారు. కొత్త నోట్లను దాచుకోవద్దని, చెలామణి చేయాలని ప్రజలకు సూచించారు. డిసెంబర్‌ 10 వరకు బ్యాంకుల్లో రూ.12 లక్షల 44 వేల కోట్ల విలువైన పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్లు జమ అయ్యాయని తెలిపారు. ఇవన్నీ తమ దగ్గరకుకు వచ్చాయని చెప్పారు.

No comments:

Post a Comment