పెద్ద నోట్ల రద్దు చేసిన కేంద్రం …ఆ తర్వాత కొత్తగా రూ.2వేల నోటును విడుదల చేసింది. ఈ నోటులో ఎన్నో ప్రత్యేకతలున్నాయని వార్తలు వచ్చాయి. GPS ఆధారిత మైక్రోచిప్ పెట్టారని…పెద్ద మొత్తంలో నోట్లు ఎవరిదగ్గరైనా ఉంటే ఈజీగా తెలిసిపోతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టింది.
అదంతా ఉత్తదేని తేలిపోయింది. ఇప్పుడు రెండువేల నోటుపై సరికొత్త ప్రచారం మొదలైంది. 2వేల నోటు తయారీలో P32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న విషయం ప్రచారం జరుగుతుంది. నోటు ప్రింట్ చేయటానికి రేడియోధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, పుణె నగరాల్లో పెద్దమొత్తంలో నోట్లు దాచిపెట్టారో అక్కడే IT అధికారులు సోదాలు చేసి.. పట్టుకోవడంతో దీనికి మరింత ప్రచారం వచ్చింది. దొరికిన డబ్బు అంతా కోట్లలో ఉండటం కూడా ఆశ్చర్యం. ఒకేచోట పెద్ద మొత్తంలో P32 అనే పదార్థం ఉంటే వెంటనే తెలిసిపోతుందని.. అందుకే పక్కా దాడులు చేస్తున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నోటులో ఉన్న ఈ రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి హానీ ఉండదని కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న రేడియో థార్మిక నోటుపై RBI క్లారిటీ ఇచ్చింది. రెగ్యులర్‌గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప.. అదనపు ఫీచర్‌ను చేర్చలేదని స్పష్టం చేసింది. ప్రింటింగ్ కు రేడియోధార్మిక ఇంక్ వాడారన్నది కూడా తప్పుడు ప్రచారమేనని తెలిపింది.
No comments:
Post a Comment