Sunday, 4 December 2016

ఊరంతా కోటీశ్వరులైన వేళ!

ఊర్లో ఒక పేద వ్యక్తి ఉన్నపళంగా కోటీశ్వరుడైతే ఆ ఆనందం అతనొక్కడిదే.. అదే ఆ ఊరు ప్రజలంతా కోటిశ్వరులైతే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటిదే జరిగింది స్పెయిన్‌లో. స్పెయిన్‌లో సెరిజేల్ డెల్ కాండెడో అనే ఓ చిన్న పల్లెటూరి జాతకం రాత్రికిరాత్రే మారిపోయింది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రాత్రిరాత్రే రూ. 17 కోట్లు వచ్చాయి. ఇదంతా ఓ వ్యక్తి దాతృత్వం వల్ల జరిగింది. ఆంటోనినో ఫెర్నాండేజ్ అనే వ్యక్తి స్పేయిన్‌లో ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థకు యజమాని. అతని చిన్నతనంలో చదువుకునే స్థోమత లేక 14ఏళ్ల వయసులోనే బడికి వెళ్లడం మానేసి ఓ బీర్ల తయారీ కంపెనీలో పనిచేశాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థను నెలకొల్పాడు. అయితే తాను పుట్టి పెరిగిన ఊరు నేటికీ మారకపోవడం, చాలా మంది పిల్లలు డబ్బుల్లేక చదువుకు దూరమవుతుండటంతో కలత చెందారు. ఈ క్రమంలో తాను మరణించిన తరువాత తన ఆస్తిలోని ఎక్కువభాగం గ్రామ వాసులకు చెందేలా వీలునామా రాశారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో ఫెర్నాండేజ్ చనిపోయాడు. దీంతో అతని ఆస్తిని గ్రామంలోని 150 కుటుంబాలకు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫెర్నాండేజ్‌ మృతికి సంతాపం తెలిపి, ఆయన ఆశయానికి అనుగుణంగా వచ్చిన డబ్బును ఖర్చుచేస్తామన్నారు.

No comments:

Post a Comment