Sunday, 4 December 2016

టీవీ ఛానెల్ లో ప్రత్యక్షమైన 13 వేల కోట్ల నల్లధనం వ్యాపారి.. సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ పథకం కింద నల్లదనాన్ని మార్చుకునేందుకు.. 13,860 కోట్ల రూపాయల మొత్తాన్ని వెల్లడించిన మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కి చెందిన వ్యాపారి మహేష్ షా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య మహేష్ షా అరెస్టు అయ్యాడు. తన వద్ద పన్ను చెల్లించని 13,860 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపిన మహేష్ షా తరువాత కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది.
అహ్మదాబాద్ లో ఆయనకోసం పోలీసులు పలు టీంలుగా విడిపోయి గాలింపు చేపట్టగా.. పోలీసుల కళ్ళు గప్పి మహేష్ షా ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొని కలకలం రేపాడు. టీవీ ఛానెల్ సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. మహేష్ షా అదుపులోకి తీసుకున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, కొన్ని అనివార్య పరిస్థితులు తలెత్తడంతో అజ్ఞాతంగా ఉన్నానని చెప్పాడు. ఈ వ్యవహారంలో తన ఫ్యామిలీని ఇరికించవద్దని కోరాడు. ఆ డబ్బు తనది కాదని.. అంత ధనం తనకు ఎక్కడి నుంచి వచ్చిందనేది అందరి బండారం బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనితో ఎవరి పేరు ఎప్పుడు బయటికి వస్తుందో అని.. గుజరాత్ లో కలకలం రేపుతోంది.

No comments:

Post a Comment