Sunday, 4 December 2016

జయలలితకు గుండెపోటు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మళ్ళీ ఆందోళన కరంగా మారింది. గత 73 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ లు విడుదల చేస్తున్నా.. అమ్మకి సంబంధించి ఒక్క ఫోటో గానీ, ఒక్క మాట గానీ బయటకు రాకపోడంతో అంతా సస్పెన్స్ గా మారింది. అంతా బాగానే ఉందని పార్టీ నేతలు ఆదివారం చెప్పినా.. ఒక్కసారిగా జయలలితకు గుండెపోటు వచ్చింది. దీనితో జయలలితను హుటాహుటిన మళ్లీ ఐసీయూలో చేర్చించారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు.
జయలలితకి పూర్తిగా నయం అయిందని.. త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే మళ్లీ జయలలితకు గుండెపోటు వార్త రావడంతో ఇది అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. అయితే.. ఆసుపత్రి వర్గాల నుండి ఎలాంటి వార్త బయటకు వస్తుందో అని ఆందోళన నెలకొంది. అలాగే పార్టీ నాయకులంతా చెన్నైకి రావాలని ఆదేశాలు జరీ అయ్యాయి. అలానే విపక్ష పార్టీ నేతలు కూడా వస్తున్నారని తెలుస్తుంది.
పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు వస్తున్నారు. విషయం తెలియగానే గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చెన్నై కి బయలు దేరారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చెన్నై వెళ్లారు. జరుగుతున్న పరిణామాలు అభిమానుల్లో ఆందోలన నెలకొంది. దీనికి సంబంధించి ఎలాంటి వార్త బయటకు వస్తుందో అని అభిమానుల్లో నెలకొంది.

No comments:

Post a Comment