పీకల్దాకా మద్యం తాగాడు. ఒళ్లు తెలియకుండా చిందులేసాడు. తనతో డ్యాన్స్ చేయాలంటూ ఓ స్టేజ్ డ్యాన్సర్‌ను బలవంతపెట్టాడు. దానికి ఆమె ససేమిరా అంది. అంతే కోపంతో ఊగిపోయిన అతడు ఆమెను తుపాకీతో కాల్చేసాడు. పెళ్లి వేడుకను నెత్తుటి మడుగులో ముంచేసాడు.
పంజాబ్ మౌర్‌మండిలో జరిగిన దారుణం ఇది. బతీండా జిల్లా మౌర్‌మండిలో ఓ వివాహ వేడుక, బారాత్ అనంతరం అలసిపోయిన బంధువుల కోసం స్టేజ్ డ్యాన్స్ ఏర్పాటు చేసారు. సంగీతంతో సేద తీరి ఎవరి స్వస్ధలాలకు వారు వెళ్లిపోవాలనేది ప్లాన్.
బంధువులంతా ఫుల్ జోష్‌తో ఊగిపోతున్నారు. ఇంతలో బిల్లా అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగి వచ్చాడు. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న కౌల్ విందర్ కౌర్ అనే డ్యాన్సర్‌ను తనతో కలిసి నాట్యం చేయాలని బలవంతపెట్టాడు. కానీ కౌర్ నిరాకరించింది.
కోపంతో వెళ్లిపోయిన బిల్లా గన్‌తో స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. వచ్చీ రాగానే కౌర్ వైపు గురి పెట్టి కాల్చాడు. వాయువేగాన్ని మించి తూటా దూసుకురావడంతో కౌర్ అక్కడకక్కడే కుప్పకూలింది. నెత్తుటి మడుగులో గిల గిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది.
తనతో కలిసి డ్యాన్స్ చేయలేదన్న కోపంతో బిల్లా అన్యాయంగా కౌర్‌ను పొట్టనపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే మృతురాలు 5నెలల గర్భవతి అని తెలుస్తోంది. తన కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలవాలనే సంకల్పంతోనే కౌర్ స్టేజ్ డ్యాన్సర్‌గా మారినట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు.
జాతీయ మహిళ కమిషన్ ఈ దారుణంపై సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి

No comments:
Post a Comment