Tuesday, 6 December 2016

మెగా అభినులకు శుభవార్త.. ఖైదీ నెంబర్ 150 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ -

మెగా స్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో హీరోగా ఈ ఎంట్రీ ఇస్తున్న సినిమా "ఖైదీ నెంబర్ 150"... ఈ సినిమా టీజర్ ను ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ చిరంజీవికి జోడీగా నటిస్తున్న సంగతి విధితమే... కాగా కాజల్ తన సోషల్ మీడియా లో డిసెంబర్ 8 ప్రత్యేక మైన రోజు కాబోతున్నదని ట్వీట్ చేసింది..


ఫస్ట్ లుక్ తో యంగ్ హీరోలకు సమానంగా మెగా అభిమానులను అలరించిన చిరంజీవి.. ని వెండి తెరపై చూడాలని మెగాఅభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నేపద్యంలో టీజర్ రిలీజ్ అనే వార్తా శుభవార్తే... వివి వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.. సంక్రాంతి కానుకగా "ఖైదీ నెంబర్ 150" రిలీజ్ కు రెడీ అవుతున్నది.

No comments:

Post a Comment