తమిళనాడులోని మధురైలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు సోమవారం
అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ మైసూరు, కొల్లం, మలప్పురం, చిత్తూరు,
నెల్లూరు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు
మరో 22 మంది నేతలను చంపేందుకు వీరు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.
ఇంకా.. దేశంలోని ఆరు కోర్టులను పేల్చేందుకు వీరు రెక్కీ నిర్వహించారని
వెల్లడించారు. అరెస్టైన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ సుల్తాన్, కరీమ్,
అబ్బాస్ అలీలుగా గుర్తించారు.
ఉగ్రవాదుల నాయకుడు హకీం పరారైనప్పటికీ, నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులు వలపన్ని వీరి అరెస్టుకు కదలగా, చివరి క్షణాల్లో హకీం తప్పించుకున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన వారిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి నుంచి దిగ్భ్రాంతి గొలిపే సమాచారాన్ని తెలుసుకున్నామని, మోదీ సహా 22 మందిని హత్య చేసేందుకు వ్యూహాలు పన్నారని, వివిధ దేశాల దౌత్యకార్యాలయాలను పేల్చివేసేందుకు కుట్ర జరిపారని వెల్లడించారు. పారిపోయిన హకీం కోసం తమిళనాడు సరిహద్దుల్లో గాలింపును ముమ్మరం చేశారు.

No comments:
Post a Comment