Sunday, 4 December 2016

ఖైదీనెం.150 ఆడియో వేదిక ఖరారు ....

చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న సినిమా  ఖైదీనెం.150 . ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ లో భారీ  అంచనాలు ఉన్నాయి . ఈ సినిమా కు సంబందించిన ఈ విషయమైనా ఫ్యాన్స్ కు పెద్ద విశేషమే . అయితే ఈ సినిమా  ను స్వయంగా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు అయితే ఇప్పుడు ఈయన  ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుక ఎక్కడ అనేది ఇంకా  తెలియరాలేదు.
సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసే విషయంలో ఆడియో రిలీజ్ ముఖ్యమైంది. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఈ ఆడియో ఫంక్షన్ల కు పెద్దచిక్కు వచ్చి పడింది . హైదరాబాద్ లోనే కాకుండా తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ఇలా పలు ప్రాంతాల్లో సినిమా ఫంక్షన్స్ నిర్వహిస్తున్నారు.ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా ఆడియో వేడుక ను చిరంజీవి మాత్రం విజయవాడ, విశాఖపట్టణం ఈ రెండింటిలో ఓ చోట చేయాలని భావిస్తున్నాడట. కానీ చరణ్ మాత్రం ఈ వేడుక హైదరాబాద్ లోనే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరు సన్నిహితులు కూడా చరణ్ కే ఓటు వేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో చెయ్యమంటున్నారంట. ‘ఖైదీనెం.150’ మూవీ ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలనే విషయంపై మరో నాలుగైదు రోజుల్లో క్లారిటీ రానుంది.

No comments:

Post a Comment