Tuesday, 13 December 2016

కోహ్లీకి లత ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌లో విరాట్‌ కోహ్లీ విశ్వరూపం చూసి సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీ అభిమానులు కూడా ముగ్ధులయ్యారు. మధుర గాయని లతా మంగేష్కర్‌కి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మ్యాచ్‌లను ఎంతో ఆసక్తిగా చూసే ఆమె చక్కటి ప్రతిభ కనబర్చిన వారిని ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. తాజాగా అద్భుత ప్రతిభతో కోహ్లీ సైతం లతను ఇంప్రెస్‌ చేసేశాడు. దాంతో ఆమె కోహ్లీకి ఒక కానుక కూడా ఇచ్చారు.
‘235 రన్స్‌ చేసిన విరాట్‌ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేసిన లతా దీదీ కోహ్లీ కోసం తన ఆపాత మధురగీతాన్ని ఒకదాన్ని పోస్ట్‌ చేశారు. తన ఆల్బమ్‌ ‘మేరే వతన్‌ కే లోగో’ నుంచి ఆకాశ్‌ కే ఉస్‌ పార్‌.. అన్న పాట యూట్యూబ్‌ లింక్‌ను లత ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కూడా చాలాకాలం తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌ చూశానని, కోహ్లీ ఆట చూడడం చాలా ఆనందం కలిగించిందని ట్వీట్‌ చేశారు.

No comments:

Post a Comment