సమాచార భద్రత విషయంలో
అత్యంత సురక్షితమని చెప్పే ఆపిల్ ఐఫోన్, ఐపాడ్‌ల సెక్యూరిటీ లాక్‌ను
ఇట్టే తెరవొచ్చని భారతీయ పరిశోధకుడు ఒకరు తేల్చేశారు. ఆపిల్ ఐఫోన్
ఐవోఎస్ 10.1 వెర్షన్‌లో ఓ బగ్ ఉందని, దీని సాయంతో ఫోన్ సెక్యూరిటీ
లాక్‌ను తెరిచినట్లు హేమనాథ్ జోసెఫ్ తెలిపారు. ఫోన్ నిర్మాణంలోని ఈ
లొసుగును పరీక్షించేందుకు లాక్ అయిన ఐఫోన్ ఒకదానిని ఆన్‌లైన్‌లో కొనుగోలు
చేసి చూశానని చెప్పారు. ఇందులో భాగంగా.. తొలుత వైఫై నెట్‌వర్క్‌కు
అనుసంధానం కావడానికి ‘అదర్ నెట్‌వర్క్’ ఆప్షన్‌ను ఎంచుకొని, దానికి ఓ
పేరు ఇవ్వడంతో పాటు డబ్ల్యూపీఏ2 కోడ్‌ను ఎంటర్ చేశానని చెప్పారు. ఈ
కోడ్‌లో వేల కొద్ది కారెక్టర్లను ఎంటర్ చేయడంతో ఐఫోన్ ఫ్రీజ్ అయిందని
తెలిపాడు. ఈ పక్రియ ద్వారా ఫోన్‌ను ఫ్రీజ్ చేసిన హేమనాథ్.. తర్వాత అదే
పక్రియను బలహీనం చేయడానికి ప్రయత్నించి విజయం సాధించారు. దీంతో ఐఫోన్
లాక్ వచ్చేసిందని ఆయన వివరించారు. కాగా, ఈ బగ్ వివరాలు తెలియడంతో ఆపిల్
దీనిని సరిదిద్దినట్లు పేర్కొంది.
https://10tv.in/andhra-pradesh/ap-unemployed-youth-protest-in-vijayawada-249394.html
ReplyDelete