Sunday, 4 December 2016

కొత్త రూ. 20, రూ. 50 నోట్లు కూడా: ఆర్బీఐ కీలక ప్రకటన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత రూ. 500, 1000 నోట్ల రద్దు తర్వాత మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త రూ. 20, రూ. 50 నోట్లను విడుదల చేయనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ ఆదివారం ప్రకటించింది. కొత్తగా విడుదల చేయనున్న రూ.20, రూ.50 నోట్లలో చిన్న మార్పులు మాత్రమే ఉంటాయని.. డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్ పాత నోట్ల మాదిరిగానే ఉంటాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.




అయితే ప్రస్తుతం ఉన్న రూ. 20, రూ. 50 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. అలానే  పాత రూ. 20, రూ. 50 నోట్లు కూడా చెలామణీలో ఉంటాయి. వాటిని రద్దు చేయడం లేదు. వాటి విలువలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. కొత్త రూ.20 నోట్ల నంబర్ ప్యానెల్ లో ఇన్ సెట్ లెటర్ గా ‘ఎల్’ ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రూ.20, రూ.50 నోట్లు కూడా చలామణి అవుతాయని ఆ ప్రకటనలో ఆర్బీఐ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment