గ్రీన్
టీలో కెటాచిన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ ని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్
ని కరిగిస్తుంది. ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో గ్రీన్ టీ బ్యాగ్
వేసి.. 2 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు టీ బ్యాగ్ తీసేసి.. తేనె, నిమ్మరసం
కలిపి తీసుకుంటే.. మంచి ఫ్లేవర్ టేస్ట్ చేయడంతో పాటు, ఫ్యాట్ కరిగిస్తుంది.
లెమన్
టీలో డి లెమనిన్ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. టీ ఆకులు,
నిమ్మకాయ, చెక్కను ఉడికించాలి. వడకట్టి.. తీసుకోవాలి. అంతే.
బ్లాక్
టీలో ఫోలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా
ఉపయోగపడతాయి. నీళ్లు మరిగించి, కొన్ని టీ ఆకులు కలపాలి. 3 నుంచి 4 నిమిషాలు
ఉడికించి.. వడకట్టి.. తీసుకోవాలి.
పుదినలో
మెంతాల్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. హాట్ వాటర్
లో పుదీనా ఆకులు వేసి.. 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి.. తాగడం
వల్ల బెల్లీ ఫ్యాట్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది
తులసిలో
ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ సెల్స్ కిల్ చేయడంలో సహాయపడతాయి.
టీ ఆకులు, అల్లం, పాలు, తులసి ఆకులు నీటిలో కలిపి.. మరిగించాలి. తర్వాత
వడకట్టి.. తీసుకోవాలి.

No comments:
Post a Comment