ఇటీవల
జరిగిన పరిశోధనల్లో కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేసి .... శరీరంలో
విషపురుగులను హరించి, అంతర్గత అవయవాల్లో ఉన్న టాక్సిన్స్ ను బయటికి
పంపిస్తున్నట్లు కనుగొన్నారు. కాబట్టి డైటీషియన్లు వారానికి రెండు లేదా
మూడు సార్లు డైట్ లో చేర్చుకోవాలి సూచిస్తున్నారు.
తులసి
ఆకుల్లో ఉండే కర్మినేటివ్ లక్షణాల వల్ల ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం
కలిగిస్తుంది. గ్యాస్ మరియు వికారం తగ్గిస్తుంది. సింపుల్ గా కొన్ని తులసి
ఆకులను నోట్లో వేసుకుని నమలి మింగాలి. లేదా తులసి ఆకులను నీటిలో వేసి
మరిగించి తులసి టీ తాగడం వల్ల ఎసిడిటి వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.
జీర్ణ
సమస్యలను నివారించడంలో దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది, ఇది నేచురల్
యాంటాసిడ్ గా పనిచేస్తుంది . స్టొమక్ గ్యాస్ ను నివారిస్తుంది. అర
టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక కప్పు వేడి నీటిలో వేసి బాగా మరిగించి
గోరువెచ్చగా తయారయిన తర్వాత రోజులో రెండు మూడు సార్లు తాగడం వల్ల మంచి
ఫలితం ఉంటుంది. లేదా దాల్చిన చెక్క పొడిని సూప్స్ లేదా సలాడ్స్ లో
చేర్చుకోవాలి.
ఎసిడిటిని
నివారించే హోం రెమెడీస్ లో బట్టర్ మిల్క్ ఒకటి. ఇందులో లాక్టిక్ యాసిడ్స్
పుష్కలంగా ఉండటం వల్ల పొట్టలోని ఎసిడిటి లక్షణాలను నార్మల్ చేస్తుంది.
కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి బట్టర్ మిల్క్ లో
మిక్స్ చేసి తాగడం వల్ల పొట్ట నొప్పి మరియు ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం
పొందవచ్చు.
ఆపిల్
సైడర్ వెనిగర్ నేచురల్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ లో
ఆల్కనైజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. ఇది స్టొమక్ ఎసిడిటిని నివారిస్తుంది.
ఒక కప్పు నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్
చేసి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఎలివేటివ్
ఎసిడిటి లక్షణాలను నివారించడంలో , గ్యాస్ తగ్గించడంలో గ్రేట్ రెమెడీస్ లో
లవంగాలు బెస్ట్, ఇది పొట్టలో హైడ్రోలిక్ యాసిడ్ ను పెంచుతుంది. దాంతో
ఎసిడిటి తగ్గించుకోవచ్చు. పొట్టలో యాసిడ్స్ తగ్గడం వల్ల ఎసిడిటి
పెరుగుతుంది. భోజనం తర్వాత నోట్లో రెండు మూడు లవంగాలు వేసుకుని నమలడం వల్ల
పొట్టలో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి, దాంతో త్వరగా జీర్ణం అవుతుంది
ఎసిడిటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బ్యాడ్ బ్రీత్ సమస్య ఉండదు.
కడుపు
ఉబ్బరంగా ఉన్నప్పుడు, కొంత మంది ద్రవాలు త్రాగడాన్ని నిరాకరిస్తుంటారు.
కాబట్టి, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని ద్రావాలను కొద్దిగా కొద్దిగా
త్రాగడం చాలా అవసరం. ముఖ్యంగా, గోరువెచ్చని నీటికి నిమ్మరసం మిక్స్ చేసి
త్రాగడం వల్ల ఒక అద్భుత మ్యాజిక్ చేస్తుంది. త్రాగిన 30నిముషాల్లోనే మీరు
ఫలితాన్ని గమనించవచ్చు. ఈ డ్రింక్ ను మీరు ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం మొదలు
పెడితే మరింత ఉత్తమ ఫలితాలను పొందచ్చు.
విటమిన్
సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరి గాయపడిన కడుపు లైనింగ్ మరియు అన్నవాహిక నయం
చేయడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పెచ్చులను పొడి చేసి అరచెంచాడు మోతాదుగా
గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి.
కామెర్లు
, లివర్ సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్ గా బార్లీ గింజలు నీటిలో మరిగించి ,
నిమ్మరసం పిండుకొని తీసుకొని తీసుకొంటే కామెర్లు తొందరగా తగ్గి .... లివర్
ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దోషం నీరుడు ద్వారా పోతుంది.
No comments:
Post a Comment