బ్రేక్
ఫాస్ట్ తీసుకునే వాళ్లతో పోల్చితే.. బ్రేక్ ఫాస్ట్ మానేసే వాళ్లకు హార్ట్
ఎటాక్ రావడానికి 27 శాతం ఎక్కువ అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు
చెబుతున్నాయి. కాబట్టి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్
రిస్క్ నుంచి బయటపడవచ్చు. టిఫిన్ తినకపోవడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ కూడా
ఉంది. ఆరోగ్యానికి, ఆహారపు అలవాట్లకు చాలా దగ్గర సంబంధం ఉందని.. హార్వర్డ్
యూనివర్సిడీ స్టడీలో తేలింది.
బ్రేక్
ఫాస్ట్ తినకుండా మానేసే మహిళల్లో టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఎక్కువ
అవకాశాలున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే బ్రేక్ ఫాస్ట్ మానేసే
వర్కింగ్ ఉమెన్స్ కి డయాబెటీస్ రావడానికి 54 శాతం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
బరువు
తగ్గాలని ఉదయాన్నే అల్పాహారం మానేస్తున్నారా ? ఇలా చేయడం వల్ల నెగటివ్
ఇంపాక్ట్ పడుతుంది. అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. బరువు
పెరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎలా అంటే.. ఆకలిగా ఉండటం వల్ల ఫ్యాట్
ఫుడ్, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. అలాగే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్
తీసుకోకపోవడం వల్ల.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తింటారు. దీనివల్ల
ఈజీగా బరువు పెరుగుతారు.
బ్రెయిన్
పవర్ తగ్గుతుంది: మెమరీపైనా ప్రభావం చూపుతుంది. మీరు బ్రేక్ ఫాస్ట్ ను
స్కిప్(దాటవేసినప్పుడు)చేసినప్పుడు, మీరు నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది
మరియు నీరసంగా ఉంటారు?అయితే, ఎప్పుడైతే మీరు హెల్తీ బ్రేక్ ఫాస్ట్
తీసుకుంటారో అప్పుడు తేడాను గమనించండి. బ్రేక్ ఫాస్ట్ ను ఎందుకు స్కిప్
చేయకూడదు అన్నదానికి ఇది ఒక ప్రధానమైన కారణం.ఉదయం అల్పాహారం తీసుకోని వారు
ఆరోజు వారి శరీరం అతి తక్కువ రక్తచక్కెర స్థాయి పొందుతుంది. అది మెదడు
క్షీణత కారణమవుతుంది. మెదడుకు సరైన మోతాదులో పోషకాలు అందక మెదడు పనిచేసే
శక్తి తగ్గుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ కు ఇది కూడా ఒక కారణం.
ఉదయం
బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే, ముందు కడుపులో రిలీజ్ అవ్వాల్సిన జీర్ణరసాలు
ప్రేగులని తీనటం మొదలు పెడతాయి....అసలు మార్నింగ్ తినటం పూర్తిగా మానేస్తే,
ఆ రసాలు కూడా విడుదల కావు..దీంతో మొదటికే మోసం వస్తుంది....మన శరీర
గడియారంలో పెను మార్పులు. జీర్ణరసాలనుంచి హార్మోన్లవరకు అన్నీ అస్థవ్యస్థం
ఇదంతా ఏ నెల్లోనో రెండు నెల్లకో జరగదు...ఇదే పద్దతి లో వెలితే ఓ ఏడాది
రెండేళ్ల తర్వాత పెను మార్పులు చూడాల్సివస్తుంది.

No comments:
Post a Comment