Monday, 19 December 2016

ఇంట్లో ఉండే డబ్బుపైనా ఆంక్షలు

పెద్ద‌నోట్ల ర‌ద్దుతో షాక్ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం ఇక‌పై ఇంట్లో నిల్వ చేసుకునే డ‌బ్బుపై కూడా ప‌రిమితి విధించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రూ.3ల‌క్ష‌ల నుంచి 15 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే న‌గ‌దును ఇంట్లో నిల్వ‌చేసుకునేలా నిబంధ‌న‌లు తెచ్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డితే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవ‌కాశం లేద‌ని ఆర్థిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

డీమోనిటైజేష‌న్ త‌ర్వాత మోడీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఇప్ప‌టికే విప‌క్షాల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై దేశం రోడ్డున ప‌డిందంటూ తృణ‌మూల్ ఫైర్ బ్రాండ్‌, మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్ప‌టికే రెండు సార్లు రాష్ట్ర‌ప‌తిని క‌లిసి ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment