తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పలువురు సోషల్‌మీడియా ద్వారా నివాళులర్పించారు. ‘రిప్ అమ్మ, రిప్ జయలలిత, ఉక్కు మహిళ’ అనే హ్యాష్ ట్యాగ్‌లతో ఆమెకు నెటిజన్లు నివాళులర్పిస్తున్నారు.
‘అమ్మ ఇక లేరు.. ఆమె నిజమైన నేత. ఎప్పటికీ మర్చిపోలేము, ప్రతీ ఆలోచనలో ఆమె ఉంటారని’ ఒకరు ట్వీట్ చేశారు.
‘అమ్మ ఇక లేరు.. ఆమె నిజమైన నేత. ఎప్పటికీ మర్చిపోలేము, ప్రతీ ఆలోచనలో ఆమె ఉంటారని’ ఒకరు ట్వీట్ చేశారు.
‘ఓ అగ్నిపర్వతం విస్ఫోటం చెంది ప్రతిభ, నాయకత్వం, ఉక్కులాంటి సంకల్పం.. వెలువడ్డాయి. ఈ పురుషాధిక్య సమాజంలో ఆ అగ్నిపర్వతం మీరు. మీరు విడిచివెళ్లిన వారసత్వం మిలియన్ల మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ఫేస్‌బుక్‌లో ఒకరు పోస్ట్ చేశారు.
ఆమె గొప్పగా పోరాడే నిజమైన నాయకురాలు, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. దేశవ్యాప్తంగా ఆమె ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ప్రత్యేకంగా తమిళవాసులను అమ్మలా చూసుకున్నారని మరొకరు నివాళి ట్వీట్ చేశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న తమిళనాడు సీఎం జయలలిత సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో తమిళనాడు రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతోమంది ఆమెకు నివాళులర్పిస్తున్నారు.

No comments:
Post a Comment