ఎందుకో మీరు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకదలుచుకున్నారు. మనిద్దరి మధ్య ఎక్కడయినా భూమి తగువు, సరిహద్దు తగవు వుందేమోననే అనుమానం కలుగుతోంది.
మన ఇష్టాఇస్టాలతో సంబంధంలేకుండా, మనకు బయట/ బాహ్యంగా, స్వతంత్రంగా అస్తిత్త్వంలో వుండేదే పదార్ధం / వస్తువు అనే నిర్వచనం వుంది. ఆత్మాశ్రయవాదానికి భిన్నమైనదని చెప్పడానికి బాహ్యాత్మక అనే పదం వాడాను. అంతకన్నా వస్తుగతం అంటే బాగుంటుంది అంటే అలాగే కానిద్దాం. అయితే, బాహ్యాత్మకం అనే పదం కటువుగా వుండొచ్చుగానీ తప్పుకాదు.
సభ్యసమాజం అనైతికగా భావించే రంగాల్లో పనిచేసే శ్రామికుల మీద కూడా నాకు అపార సానుభూతి వుంది. వృత్తి వేశ్యలకు (commercial sex workers) మద్దతుగా నేను మాట్లాడిన సందర్భాలు అనేకం వున్నాయి. AIDS awareness projectలో resource person గా వున్నప్పుడు వాళ్ళతో అనేక వేదికల మీద కలిసి పనిచేశాను. వాళ్ళలో కొందరితో సన్నిహిత సంబంధాలు కూడా వున్నాయి. మనం ఏకపత్నీవ్రతాన్నీ, పాతివ్రత్యాన్ని ఒక విలువగా చూసినంత కాలం వృత్తి వేశ్యలు వుంటారని కూడా నేను రాసివున్నాను. commercial sex workers స్త్రీలే కానక్కర లేదు; పురుషులూ కావచ్చు. ఇప్పటి వివాహ వ్యవస్థలోనే వివాహేతర సంబంధాలకు బీజాలున్నాయి అని కూడా రాశాను.
కలకత్తాలో నక్సలైట్లను ఏరి కాల్చిపడేస్తున్న రోజుల్లో విప్లవకారులు కొన్ని వేశ్యాగృహాల్లో షెల్టర్ తీసుకున్నట్టు నాకు తెలుసు. కావాలని బ్రోతల్ కేసుల్లో అరెస్టయ్యి చావుని తప్పించుకున్నవారూ వున్నారు. బ్రోతల్ హౌస్ లో దొరికినవాడు విప్లవకారుడై వుంటాడని సాధారణ పోలీసులు ఊహించలేరుగా?
నేనూ మరో ‘వాంటేడ్’ కామ్రేడ్ పోలీసులకు దొరికినప్పుడు టికెట్ లెస్ ట్రావెలర్స్ గా నటించి పెనాల్టీ కట్టి విప్లవకారులమనే అనుమానం రాకుండా తప్పించుకున్న నాటకీయ సంఘటన కూడా ఒకటుంది.
అయితే నేను తప్పుపట్టింది వేశ్యల్నికాదు; వేశ్యాగృహాల్ని నడిపేవాళ్ళని. సారాభట్టిల్లో పనిచేసేవాళ్ళనికాదు; సారావ్యాపారుల్ని. ఇంత చిన్న లాజిక్కును మీరు ఎలా మిస్ అయ్యారో అర్ధం కావడంలేదు.
ఈ వివరణ తరువాతనైనా మీ అజ్ఞానం తొలిగిపోతే నేను చాలా ఆనందిస్తాను.
No comments:
Post a Comment