Monday, 19 December 2016

పిల్లల్లా పాకండి వ్యాయామ ప్రియుల్ని ఆకర్షిస్తున్న సరికొత్త కసరత్తు

ఇది కొత్త కసరత్తేమి కాదు. ప్రతి ఒక్కరూ తమ పసితనంలో నడక నేర్చుకునే ముందు చేసిన పనే. మోకాళ్లు, మోచేతుల ఆధారంగా పాకడం. ఇప్పుడదే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వ్యాయామంగా మారింది. కసరత్తుల్లో ఒక భాగమైపోయింది. పెద్దపెద్ద పరికరాలతో పనిలేకుండా.. పిల్లల్లా పాకడం దేహదారుఢ్యానికి బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పూర్తి దేహానికి వ్యాయామం; వెన్నెముకకు బలం; స్థిరత్వం, సమన్వయం, చురుకుదనం ఇలా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడిస్తున్నారు. కీలక కండరాలు, భుజాలు, తొడలు, మోకీళ్లను బలోపేతం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. అయితే మోకాళ్ల నెప్పులున్నవారు, వృద్ధులు, ఇతర సమస్యలున్నవారు ఈ వ్యాయామం జోలికి వెళ్లకపోవడమే మంచిదని, వైద్యుల సలహా తీసుకుని ఆరంభించాలని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment