భోజనానికి
ముందు వెనుకలు మనం పాటించే ఆరోగ్య సూత్రాలు ఎంతో ముఖ్యమైనవి. ఉదయం
పరకడుపున రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగండి. ఉదయంపూట అల్పాహారం ముగిశాక
భోజనం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య చేయాలి. భోజనం చేసేటప్పుడు సంతోషంగా
ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుకునే భోజనంతోపాటు సలాడ్ ఆహారంగా
తీసుకోండి.
ప్రతి
రోజు మీరు తీసుకునే భోజనంలో రెండుపూటలా ఏడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి.
భోజనం చేసేటప్పుడు కాసింత నీటిని మాత్రమే సేవించండి. ఎక్కువ నీటిని మాత్రం
ఎట్టి పరిస్థితుల్లోను సేవించకూడదు. భోజనం
చేసిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలించండి. భోజనం చేసిన తర్వాత
ఐదు వందల అడుగులు నడవండి. రాత్రిపూట భోజనం సాయంత్రం ఏడు గంటల నుంచి
తొమ్మిది గంటల మధ్య చేయండి.
రాత్రి
పది గంటల తర్వాత భోజనం చేయకూడదు. అది అనారోగ్యాలకు దారి తీస్తుంది. రాత్రి
పడుకునే ముందు పాలు సేవించండి. మీరు నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం
తీసుకోండి. రాత్రిపూట బ్రష్ చేసి పడుకోండి. భోజనానంతరం మిఠాయి తీసుకోవడం
చాలా మంచిది.
No comments:
Post a Comment