Sunday, 4 December 2016

నిద్రకు మాత్రం సరైన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. దీని ఫలితంగా అనేక రుగ్మతలు వారిని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా శారీరక, మానసిక ఒత్తిడి ఒత్తిడి వగా పెరుగుతోంది

ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆహారం, వ్యాయామంలపై దృష్టి సారించారు. కానీ ఎక్కునిద్రకు మాత్రం సరైన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. దీని ఫలితంగా అనేక రుగ్మతలు వారిని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా శారీరక, మానసిక ఒత్తిడి వగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తగినంత నిద్ర పోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్రలేమి వల్ల వ్యక్తి రోజు వారీ ఎదురయ్యే సాధారణ ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. దీని వల్ల చిరాకు, అసహనం, మూడీగా ఉండడం, దేని పైనా మనసు పెట్టలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
2. పరీక్షకు వెళ్లడానికి ముందు చాలా మంది రాత్రంతా మేల్కొని చదివేస్తుంటారు. దీని వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఏదైనా నేర్చుకోవాలన్నా, జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కంటి నిండా నిద్ర తప్పనిసరని తాజా అధ్యయనాల్లో తేల్చారు. చాలీ చాలని నిద్ర మెదడుకు నేర్చుకునే సామర్థ్యాన్ని, కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడం, జ్ఞాపకాల్ని తిరగతోడడం వంటి వాటన్నింటినీ తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు.
3. దీర్ఘకాలం పాటు నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నట్టయితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యల్ని పరిష్కరించే నేర్పు తగ్గడం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం, మానసిక కుంగు బాట్లు, తరచూ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి.
4. నిద్ర తగ్గితే క్యాన్సర్లు, టైప్-2 మధుమేహానికి కారణమయ్యే ఇన్సులిన్ నిరోధకత సమస్యల వంటివి కూడా చుట్టు ముడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
5. శరీరంలో జీవక్రియల్ని, కణాల్లోని శక్తి నిల్వల్నీ నియంత్రించే జీవ గడియారం కూడా కంటి నిండా నిద్ర, సరైన ఆహారం ఉన్నప్పుడే చక్కగా పనిచేస్తుందని అమెరికా అధ్యయనం ఒకటి గుర్తించింది.
6. దీర్ఘకాలికంగా చాలినంత నిద్రలేకుండా గడపడం వల్ల జీవక్రియ పనితీరులో మార్పులు తలెత్తుతాయి. పిండి పదార్థాలను జీర్ణించుకోవడం, నిల్వ చేసుకోవడం, ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్‌ను ఎక్కువెక్కువగా విడుదలయ్యేలా ప్రేరణలు అందించడం వంటి జీవక్రియ మార్పులు చోటు చేసుకుంటాయి.
7. కార్టిసోల్ ఎక్కువగా విడుదలైతే పొట్ట చుట్టూ అదనపు కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల గుండె జబ్బుల ముప్పూ ఎక్కువవుతుంది.
8. నిద్రలేమి లెప్టిన్ నిల్వల్ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని అణచి పెడుతూ, మరోవైపు ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ నిల్వల్ని పెంచుతుంది. ఈ సమతౌల్యం కారణంగానే ఆకలి-తినడం అనే ప్రక్రియ సజావుగా సాగుతుంది.
9. నిద్ర ఎంత సేపు పోవాలనే విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కో అలవాటు ఉంటుంది. కొంత మంది కొన్ని గంటల నిద్రతో సరిపెడతారు. మరి కొంత మందికి 8 నుంచి 9 గంటల నిద్ర లేకపోతే సరిపోదు. రోజుకు 5 గంటల కన్నా నిద్ర తగ్గినా, 9 గంటల కన్నా ఎక్కువ సేపు నిద్ర పోయినా అనారోగ్య సమస్యలు తప్పవని పలు అధ్యయనాల్లో గుర్తించారు.
నిద్ర తగ్గినా -పగలు నిద్ర పోతారు
దీనితో రుచులపై కోరికలు పెరుగుతాయి
నిద్ర తగ్గితే శరీరంలో రాత్రి క్లీనింగ్ ప్రక్రియ
సరిగా జరుగక ట్యాక్సిన్స్ పెరిగీపోతాయి
నిద్ర తగ్గితే రాత్రి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్
సరిగా జరుగవు . దీంతో హార్శన్స్ అసమతుల్యత
ఏర్పడీ -హార్మోన్స్ పై వత్తిడి ఏర్పడుతుంది
కొందరు బరువు తగ్గుతారు
మరి కొందరు పెరుగుతారు
జీర్ణశక్తి -శారీరక శక్తీ తగ్గుతాయి

No comments:

Post a Comment