కేవలం తన నోటి మాటతో ఉన్న పరిస్థితి ని మొత్తం రివర్స్ చెయ్యగల సత్తా కెసిఆర్ కి ఉంది. తన మీద కోపంగా ఉన్న వారినే కాక తన బద్ద శత్రువులని కూడా తన మాటలతో వెనక్కి ఎలా తెచ్చుకోవాలో కెసిఆర్ కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు.
సీన్ మొత్తాన్నీ తనకి అనుకూలంగా మార్చుకోవడం కెసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య,ఒప్పందకార్మికుల ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తానని చెప్పిన వరం తెలంగాణ సర్కారు పవర్ లోకి వచ్చిన ఇంత కాలం వరకూ చోటు చేసుకోని నేపథ్యంలో ఈ ఇష్యూపై ఉద్యోగులు కాస్తంత గుర్రుగానే ఉన్నారు.కొందరైతే.. ఇదే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా చేయటమే కాదు.. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపటం.. తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకోవటానికి మరికొంత సమయాన్ని ఒడుపుగా తీసుకోవటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యే కిటుకుగా చెప్పక తప్పదు.
తాజాగా ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.ఇటీవల కట్టించిన సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో మాట్లాడిన కేసీఆర్.. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు హిట్ సినిమా ఫార్ములా ఏమిటన్నది తనదైన శైలిలో చెప్పేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పని చేయాలన్న విషయాన్ని చెబుతూ.. ‘‘చిత్తశుద్దితో సీఎం పని చేయాలి. అటెండరూ పని చేయాల్సిందే. సినిమాలో హీరో ఒక్కడే ఉండడు. అన్ని పాత్రలు ఉంటాయి. ఎవలి పాత్ర వాళ్లు పోషించినప్పుడే సినిమా హిట్టయితది. అట్లనే రాష్ట్ర ప్రగతి కోసంకిందిస్థాయి ఉద్యోగి నుంచి సీఎం వరకూ ఎవరి పాత్ర వారు పోషించాల్సిందే’’ అని చెప్పారు.
No comments:
Post a Comment