క్యాబేజ్
అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్ ఫ్యాట్,
కొలెస్ట్రాల్ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్ నుంచి ఎక్కువ మొత్తంలో
ఫైబర్ పొందవచ్చు. హార్ట్‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్ చేయడంలో
క్యాబేజ్ వల్ల లభించే పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ కీలకపాత్ర పోషిస్తాయి.
వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ..
ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం
వల్ల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యమూ బావుంుటంది. ఇందులో ఉండే విటమిన్ బి,
సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి.
అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది.
క్యారెట్స్: క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ
తెలుసు. కానీ.. వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు
చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్-ఎ కళ్ల
ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్
కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్
క్యారెట్స్ నుంచి పొందవచ్చు.

No comments:
Post a Comment