Wednesday, 30 November 2016

దానిమ్మ అద్భుత ఔషదం.

దానిమ్మ బరువును నియంత్రిస్తుంది: ఇది కేలరీలు లేని ఒక పండు.
దానిమ్మ పండు రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది.
దానిమ్మలో ఆప్రియోడిసాసిక్ కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటారో అప్పుడు టెస్టోస్టిరాన్ లెవల్స్ క్రమంగా పెరిగి సెక్స్ లైఫ్ ను ఆనందంగా మార్చుతుంది. : అంగస్తంభన లోపం అనే సమస్యను దానిమ్మ నయం చేస్తున్నదని ఒక నమ్మకం ఉంది. ఇది ఒక అద్భుత ఔషదం.
దానిమ్మ రసం మాత్రమే మధ్యస్తంగా అంగస్తంభన మెరుగుపరుస్తుంది.
రోజూ దానిమ్మ పండును తినండి. యవ్వనంగా ఉండండి అంటున్నారు వైద్యులు. వృద్ధాప్యాన్ని దరిచేరనీయకుండా.. నిత్యయవ్వనంతో కాంతులీనాలనుకుంటే మాత్రం దానిమ్మను రోజూ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కణజాలం బలహీనపడుతుంది. అలా జీవకణంలో ఏర్పడిన మార్పుతో శరీర వ్యవస్థ సత్తువ కోల్పోతుంది.
ఈ కారణంగానే యవ్వనంలో దేహదారుఢ్యంతో ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో కండలు కరిగి బలహీనంగా కనిపిస్తుంటారు. ఇంకా చర్మం ముడతలు పడతాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. దానిమ్మ పండు రోజూ తీసుకుంటే సరిపోతుందని.. ఎందుకంటే.. దానిమ్మలో ''యూరోలిథిన్‌ ఏ" అనే పదార్థం జీవకణాల్లోని శక్తి కేంద్రాల పనితీరును ద్విగుణీకృతం చేస్తున్నట్లు వెల్లడైంది.
దానిమ్మను రోజు వారీగా అరకప్పు తీసుకోవాలి. సలాడ్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. స్వీట్లు, సూప్‌లలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజూవారీగా దానిమ్మను తీసుకునే వారిలో విటమిన్ ఏ లోపం ఉండదని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా దానిమ్మను తీసుకునేవారిలో మిగిలిన వారికంటే 45 శాతం ఆయుర్దాయం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

No comments:

Post a Comment